'జన నాయకుడు' కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు..! 1 d ago
AP: కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్థానిక సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి వాటిని ఆన్ లైన్ లో నమోదు చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించి వాటి వివరాలను ఆన్ లైన్ లో పొందుపరిచేలా జన నాయకుడు కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చేయని అవకతవకలు లేవని చంద్రబాబు చెప్పారు. కబ్జాలు చేశారు..రికార్డులు మార్చారు..రాజకీయ వివక్షలు చూపించారని అన్నారు. భూ రికార్డులను సరి చేసి..పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.